by admin on | 2025-04-10 19:13:20 | Visits: 78
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు..చిరంజీవి
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం
1 month ago
29 days ago
5 days ago
28 days ago
1 month ago
27 days ago
15 days ago
22 days ago